News December 4, 2024
బీటెక్ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి కసరత్తు
TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. రాష్ట్రంలో 1.16లక్షల బీటెక్ సీట్లుండగా, 70% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. వీరిలో అర్హులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. 30% యాజమాన్య కోటాలో మెరిట్, NRI పేరిట కాలేజీలు అధిక వసూళ్లు చేస్తున్నాయనే ఆరోపణలతో విద్యామండలి చర్యలకు ఉపక్రమించింది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.
Similar News
News January 21, 2025
ఒకే చోట రూ.82 లక్షల కోట్లు
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఒకే దగ్గర నిలబడ్డారు. ఈ నలుగురి నికర ఆదాయం $950 billion+గా ఉంది. అంటే అక్షరాలా రూ.82లక్షల కోట్లు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ $433 బిలియన్లతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.
News January 21, 2025
టీమ్ ఇండియా జెర్సీలో మహ్మద్ షమీ
స్టార్ పేసర్ మహ్మద్ షమీ చాన్నాళ్ల తర్వాత టీమ్ ఇండియా జెర్సీ ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు షమీ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యారు. కాలి గాయంతో బాధపడుతూ ఆయన దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరంగా ఉన్నారు.
News January 21, 2025
కాంగ్రెస్ ‘జైబాపూ’ ఈవెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు అవమానం
కర్ణాటక బెలగావిలో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు ఘోర అవమానం జరిగింది. గౌరవిస్తామని జై బాపూ ఈవెంట్‌కు కాంగ్రెస్ వారిని ఆహ్వానించింది. తీరా వచ్చాక వారినెవరూ కన్నెత్తి చూడలేదు. ఐడీ కార్డులు ఇవ్వకపోవడంతో పోలీసులు లోపలికి రానివ్వలేదు. దాంతో 92 ఏళ్ల ఆ వృద్ధులు బాంక్వెట్ హాల్ మెట్లమీదే పడిగాపులు పడ్డారు. నీళ్లు, ఆహారం లేక అలమటించారు. రానంటున్నా పిలిచి అవమానించారని ఆవేదన చెందారు. మీడియా కలగజేసుకొని వారికి సాయపడింది.