News March 26, 2024

వాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు

image

AP: వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ శ్రీకాళహస్తి TDP అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన <<12923028>>వ్యాఖ్యలు<<>> ఆయన వ్యక్తిగతమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలను కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని మేం సమర్థించం’ అని చెప్పారు.

Similar News

News January 25, 2026

పాక్‌ హెచ్చరికలపై ICC సీరియస్?

image

బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై ICC ఆగ్రహించినట్లు తెలుస్తోంది. బంగ్లాను వెనకేసుకొస్తూ PCB ఛైర్మన్ <<18949866>>నఖ్వీ<<>> చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటామన్న పాక్ హెచ్చరికలపై ICC సీరియస్ అయినట్లు సమాచారం. టోర్నీని బహిష్కరిస్తే.. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌తో పాటు ఆటగాళ్లకు ఇచ్చే NOCలను కూడా రద్దు చేస్తామన్నట్లు తెలుస్తోంది.

News January 25, 2026

ఛీటింగ్ ఆరోపణలు.. రూ.10 కోట్ల దావా వేసిన పలాష్ ముచ్చల్

image

₹40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అమ్మాయితో మంచంపై <<18940645>>అడ్డంగా దొరికాడని<<>> తనపై వస్తున్న ఆరోపణలపై పలాష్ ముచ్చల్ కోర్టుకెక్కారు. ₹10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని స్పష్టం చేశారు. ‘నా పరువు, వ్యక్తిత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్ ద్వారా విజ్ఞాన్ మానేకు లీగల్ నోటీసు పంపాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

News January 25, 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<>HCL<<>>) 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc(జియోలజీ, అప్లైడ్ జియోలజీ) అర్హతో పాటు పని అనుభవం గల వారు ఫిబ్రవరి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.65వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hindustancopper.com