News October 25, 2024
తిరుమల హోటళ్లకు బాంబు బెదిరింపులు
AP: తిరుమలలోని నాలుగు హోటళ్లను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం తిరుపతి, అలిపిరి పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. మరోవైపు ఇవాళ ఏకంగా 70కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కూడా కలకలం రేపింది. వీటిలో ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో విమానాలు ఉన్నాయి.
Similar News
News November 2, 2024
మా పాలనలో తెలంగాణ సూర్యుడిలా ఉదయిస్తోంది: రేవంత్
TG: కాంగ్రెస్ హామీలు అమలు చేయట్లేదన్న ప్రధాని మోదీ <<14506698>>ట్వీట్‌కు<<>> సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్‌పై సబ్సిడీ, ఉచిత కరెంట్ అందిస్తున్నాం. రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలు నిర్మిస్తున్నాం. పోటీ పరీక్షలను విజయంతంగా నిర్వహించాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించలేని రికార్డులివి. BRS చీకటి పాలన పోయి తెలంగాణ సూర్యుడిలా ఉదయిస్తోంది.’ అని ట్వీట్ చేశారు.
News November 2, 2024
ఇంకెంత మంది బాలికలు బలవ్వాలి పవన్?: వైసీపీ
AP: పవన్ కళ్యాణ్ కక్ష సాధింపులపై కాకుండా శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని వైసీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై <<14509648>>హత్యాచార<<>> ఘటనను మెన్షన్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ‘మీ చేతగానితనంతో ఇంకెంత మంది బాలికలు ఇలా బలి అవ్వాలి పవన్ కళ్యాణ్?’ అని ప్రశ్నించింది.
News November 2, 2024
తన డీప్‌ఫేక్ ఫొటోపై స్పందించిన మృణాల్
సినీ ఇండస్ట్రీని డీప్‌ఫేక్ వెంటాడుతూనే ఉంది. తాజాగా నటి మృణాల్ ఠాకూర్‌తో దీపావళి టపాసులు కాల్చినట్లు ఓ వ్యక్తి ఫొటో ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది వైరలవడంతో దీనిపై మృణాల్ స్పందించారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మీరెందుకు ఇలా తప్పుగా ఫొటోలు ఎడిట్ చేస్తున్నారు? ఈ పని బాగుంది అనుకుంటున్నారా? అస్సలు బాలేదు’ అని కామెంట్ చేశారు. గతంలోనూ అసభ్యకర వీడియోకు రష్మికతో డీప్‌ఫేక్ చేశారు.