News November 14, 2024

బ్రెజిల్ సుప్రీం కోర్టు వద్ద బాంబు పేలుళ్లు

image

బ్రెజిల్‌లో ఏకంగా సుప్రీం కోర్టును పేల్చేందుకు ఓ దుండగుడు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో వచ్చిన సూసైడ్ బాంబర్ ప్రవేశ ద్వారం వద్దే అవి పేలిపోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. అతడి వివరాలతో పాటు వెనుక ఎవరున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుండగా ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News November 14, 2024

ఎడమ కంటికి సమస్య.. కుడి కంటికి ఆపరేషన్ చేశారు

image

UP గ్రేటర్ నోయిడాకు చెందిన నితిన్ భాటి తన కొడుకుకు ఎడమ కంట్లో నుంచి తరచూ నీరు కారుతోందని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడి కంట్లో ఫారెన్ బాడీ(మెటల్ వంటి ధూళి) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడి ఎడమ కంటికి కాకుండా కుడి కంటికి ఆపరేషన్ చేశారని తేలింది. ఘటనపై బాలుడి తండ్రి PSలో ఫిర్యాదు చేశారు.

News November 14, 2024

విలియమ్సన్ రికార్డును సమం చేసిన సూర్య

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించారు. టీ20ల్లో 200కుపైగా రన్స్ ఎక్కువ సార్లు కొట్టిన జట్టుకు నాయకత్వం వహించిన రెండో కెప్టెన్‌గా సూర్య (9) రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆయన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) రికార్డును సమం చేశారు. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ (12) ఉన్నారు. మూడో స్థానంలో విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (7) కొనసాగుతున్నారు.

News November 14, 2024

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం

image

TG: కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 7న ట్యాంక్‌బండ్ పరిసరాల్లో, 8న సచివాలయ పరిసరాల్లో, 9న నెక్లెస్ రోడ్డులో వేడుకలు నిర్వహించనున్నారు. 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.