News November 14, 2024

బ్రెజిల్ సుప్రీం కోర్టు వద్ద బాంబు పేలుళ్లు

image

బ్రెజిల్‌లో ఏకంగా సుప్రీం కోర్టును పేల్చేందుకు ఓ దుండగుడు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో వచ్చిన సూసైడ్ బాంబర్ ప్రవేశ ద్వారం వద్దే అవి పేలిపోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. అతడి వివరాలతో పాటు వెనుక ఎవరున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుండగా ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News March 13, 2026

ఈరోజు నమాజ్ వేళలు (13-3-2026) శుక్రవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 13, 2026

శుభ సమయం (13-3-2026) శుక్రవారం

image

➤ తిథి: బహుళ దశమి తె.5.51 వరకు
➤ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.06 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.11-8.32, మ.1.18-సా.4.04, సా.5.04-సా.6.03
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.33-ఉ.9.12, మ.12.30-మ.1.18
➤ వర్జ్యం: ఉ.9.22-ఉ.11.07
➤ అమృత ఘడియలు: రా.7.51-రా.9.36