News November 15, 2024

ధాన్యం సేకరించిన వారంలోపే బోనస్: మంత్రి

image

TG: సన్న రకాల ధాన్యం పండించిన రైతులకు ₹500 బోనస్ కచ్చితంగా ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన వారంలోపే చెల్లిస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. హరీశ్ రావు, KTR రైతులను రెచ్చగొడుతున్నారని, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.

Similar News

News December 3, 2024

మార్చి 15 నుంచి ‘టెన్త్’ పరీక్షలు?

image

AP: వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ విడుదల చేసిన యాక్షన్ ప్లాన్‌లో రూపొందించారు. సంక్రాంతి సెలవులను 3 రోజులకు కుదించారు.

News December 3, 2024

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు

image

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ వెంకటదత్త సాయితో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ఈ నెల 22న వీరి వివాహం ఉదయ్‌పుర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. అనంతరం 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తారు. కాగా వరుడు సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. త్వరలో వీరి వివాహ పనులు ప్రారంభమవుతాయి.

News December 3, 2024

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున కాసేపు వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో వైపు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. చలి తీవ్రత బాగా తగ్గింది.