News June 23, 2024

వరల్డ్ కప్‌లో బూమ్ బూమ్ బుమ్రా మ్యాజిక్!

image

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. తన పదునైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆయన టోర్నీలో 19 ఓవర్లు వేసి 65 పరుగులే ఇచ్చారు. మొత్తం 10 వికెట్లు పడగొట్టారు. ఎకానమీ రేటు 3.42, యావరేజ్ 6.50గా ఉంది. ఈ ఎడిషన్‌లో బుమ్రా 114 బంతులు వేసి ఒకే ఒక సిక్సర్ ఇవ్వడం విశేషం.

Similar News

News November 4, 2024

రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ అతడే: కైఫ్

image

రోహిత్ శర్మ తర్వాత టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత జట్టులో కేవలం రిషభ్ పంత్ మాత్రమే అందుకు గట్టి పోటీదారు. కెప్టెన్సీకి అతడు న్యాయం చేయగలడు. అతడు ఏ స్థానంలో వచ్చినా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు న్యూజిలాండ్ భయపడింది’ అని వ్యాఖ్యానించారు.

News November 4, 2024

పంచనామా అంటే ఏమిటి? ఆ పేరెలా వచ్చింది?

image

నేరవార్తల్లో పంచనామా పదం చదివే ఉంటాం. ఘటనాస్థలికి అధికారి వెళ్లి గమనించినవి నమోదు చేయడమే పంచనామా. Ex: అనుమానాస్పద మృతి కేసులో మృతదేహ స్థితి, గది, అక్కడి వస్తువులు సహా చూసిన వివరాలన్నీ రాసుకుంటారు. దర్యాప్తులో ఇవి క్లూ/సాక్ష్యంగా ఉపయోగపడతాయి. గతంలో వివాద పరిష్కారాలకు ఊరి పెద్ద సహా ప్రముఖులు కొందరు కలిసి ఐదుగురు బృందంగా ఉండేవారు. ఏదైనా తగాదాపై వారి ఎదుట పత్రం రాసేవారు కావడంతో పంచనామా పేరు వచ్చింది.

News November 4, 2024

కెనడాలో భారతీయుల భ‌ద్ర‌త‌పై కేంద్రం ఆందోళ‌న‌

image

కెనడాలో భార‌త పౌరుల భ‌ద్ర‌త‌పై కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. బ్రాంప్ట‌న్‌లోని హిందూ స‌భ ఆలయంపై వేర్పాటువాదుల హింసాత్మ‌క చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడుల నుంచి ప్రార్థ‌నా స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు కెన‌డా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. దాడుల‌కు పాల్ప‌డిన వారిపై విచార‌ణ జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నామంది. పౌరులకు తమ కాన్సులర్లు చేస్తున్న సాయాన్ని ఈ దాడులు ఆపలేవని పేర్కొంది.