News September 28, 2024

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు షాక్

image

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్రీన్ గాయపడ్డారు. వెన్నుకి సంబంధించిన సమస్య తలెత్తడంతో ఆయన వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో భారత్‌తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గ్రీన్ పాల్గొంటారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. ENGతో సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి గాయాల బారిన పడ్డ ఆసీస్‌ ప్లేయర్ల సంఖ్య ఐదుకి చేరింది. కాగా భారత్, AUS మధ్య NOV 22న తొలి టెస్ట్ జరుగనుంది.

Similar News

News October 13, 2024

అత్తాకోడళ్లపై అత్యాచారం.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు: మంత్రి

image

AP: శ్రీసత్యసాయి(D) చిలమత్తూరు మండలంలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక <<14338493>>అత్యాచారం<<>> సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులను ఆమె పరామర్శించారు. ఈ ఘటనపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారని, పోలీసులు 4 బృందాలుగా గాలించి నిందితుల్ని 24 గంటల్లో పట్టుకున్నారని చెప్పారు.

News October 13, 2024

T20 వరల్డ్ కప్: టీమ్ ఇండియా లక్ష్యం 152 రన్స్

image

టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 151/8 స్కోరు చేసింది. టోర్నీలో నిలవాలంటే ఇది భారత్‌కు చావో రేవో లాంటి మ్యాచ్ కావడం గమనార్హం. ఆసీస్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ 40 రన్స్, టాహ్లియా, పెర్రీ చెరో 32 పరుగులు చేశారు. భారత అమ్మాయిల్లో రేణుక, దీప్తి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.

News October 13, 2024

ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు: బండి

image

TG: రాష్ట్రంలో కులగణన అంతా ఫేక్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఓడిపోతామని గ్రహించి స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ‘రూ.150 కోట్లతో కులగణన అంటూ డైవర్షన్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది. మళ్లీ గణన ఎందుకు? ఆ నివేదికను గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ విడుదల చేయలేదు. ఇద్దరి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి?’ అని నిలదీశారు.