News October 1, 2024

సరిహద్దుల్లో ఇంకా సాధారణ పరిస్థితి రాలేదు: ఆర్మీ చీఫ్

image

చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితికి ఇంకా రాలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ కార్యక్రమంలో తెలిపారు. ‘దౌత్యపరంగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం కోర్ కమాండర్లదే తుదినిర్ణయం. 2020కి పూర్వం ఉన్న స్థితి నెలకొనాలి. అప్పటి వరకు బోర్డర్‌లో వాతావరణం గుబులుగానే ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు వస్తుంది కానీ మేం మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటాం’ అని పేర్కొన్నారు.

Similar News

News October 1, 2024

కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అభ్యర్థులకు BIG ALERT

image

APలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ‘5 నెలల్లో PMT, PET పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫాం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను <>వెబ్‌సైటులో <<>>పొందుపరుస్తాం. 2వ దశలో ఉత్తీర్ణులైన వారికి 3వ దశ ప్రధాన పరీక్ష జరుగుతుంది’ అని ఆమె ప్రకటించారు.

News October 1, 2024

మ్యాచ్‌లో రోహిత్ ఇచ్చిన సందేశం ఏంటంటే..: KL రాహుల్

image

బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్‌గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.

News October 1, 2024

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.