News October 1, 2024
సరిహద్దుల్లో ఇంకా సాధారణ పరిస్థితి రాలేదు: ఆర్మీ చీఫ్
చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితికి ఇంకా రాలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ కార్యక్రమంలో తెలిపారు. ‘దౌత్యపరంగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం కోర్ కమాండర్లదే తుదినిర్ణయం. 2020కి పూర్వం ఉన్న స్థితి నెలకొనాలి. అప్పటి వరకు బోర్డర్‌లో వాతావరణం గుబులుగానే ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు వస్తుంది కానీ మేం మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటాం’ అని పేర్కొన్నారు.
Similar News
News October 13, 2024
టన్ను ఇసుక రూ.475కే ఇచ్చావా?.. ఎవరికిచ్చావ్?: టీడీపీ
AP: ఇసుక గురించి, మద్యం గురించి <<14349346>>జగన్<<>> ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని TDP కౌంటర్ ఇచ్చింది. ‘నీ ప్రభుత్వం 20 టన్నుల లారీ రూ.30వేల నుంచి రూ.40వేలకు అమ్మితే మా ప్రభుత్వంలో రూ.16వేల నుంచి రూ.18వేలకు కేవలం రవాణా ఛార్జీలతో వస్తుంది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి వందల మంది ఆత్మహత్యకు కారణమయ్యావ్. టన్ను రూ.475కే ఇచ్చావా? ఎవరికిచ్చావ్?’ అని ఫైరయింది.
News October 13, 2024
అత్తాకోడళ్లపై అత్యాచారం.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు: మంత్రి
AP: శ్రీసత్యసాయి(D) చిలమత్తూరు మండలంలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక <<14338493>>అత్యాచారం<<>> సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులను ఆమె పరామర్శించారు. ఈ ఘటనపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారని, పోలీసులు 4 బృందాలుగా గాలించి నిందితుల్ని 24 గంటల్లో పట్టుకున్నారని చెప్పారు.
News October 13, 2024
T20 వరల్డ్ కప్: టీమ్ ఇండియా లక్ష్యం 152 రన్స్
టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 151/8 స్కోరు చేసింది. టోర్నీలో నిలవాలంటే ఇది భారత్‌కు చావో రేవో లాంటి మ్యాచ్ కావడం గమనార్హం. ఆసీస్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ 40 రన్స్, టాహ్లియా, పెర్రీ చెరో 32 పరుగులు చేశారు. భారత అమ్మాయిల్లో రేణుక, దీప్తి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.