News August 26, 2024
ఆర్బీఐ ULIతో అప్పు తీసుకోవడం ఇక ఈజీ!

UPIలో ఐడీ, ఫోన్ నంబర్, QR కోడ్ స్కాన్ ద్వారా డబ్బులు పంపిస్తారు. కొన్ని మార్పులతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఈజీగా అప్పు తీసుకొనేలా <<13943899>>ULI<<>> తీసుకొస్తున్నారు. అనుమతి ఆధారంగా ఈ వ్యవస్థలో వివిధ రాష్ట్రాల, వ్యక్తిగత భూ రికార్డులు, ఇతర వివరాలు ముందే పొందుపరుస్తారు. దీంతో డాక్యుమెంటేషన్, బ్యాంకుల చుట్టూ తిరగడం ఉండదు. తక్కువ టైమ్‌లోనే MSMEలు, రైతులు, చిన్న, మధ్య తరహా రుణ గ్రహీతలు అప్పు తీసుకోవచ్చు.
Similar News
News February 15, 2025
మహాకుంభమేళా.. 20,000 మంది ఆచూకీ లభ్యం

కోట్లాది మంది భక్తులతో కళకళలాడుతున్న మహాకుంభమేళాలో కుటుంబాల నుంచి మిస్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే AI బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా 20K మందిని వారి ఫ్యామిలీల వద్దకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున అత్యధికంగా 8,725 మందిని కనిపెట్టినట్లు చెప్పారు. విడిపోయిన భక్తులను కాపాడటంలో UNICEF, NGOలు, వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
News February 15, 2025
ఆమెకు 74 ఏళ్లు.. అయితేనేం!

పిల్లలు, మనవళ్లతో సాధారణ జీవితం గడుపుతున్న ఓ ముసలవ్వను సోషల్ మీడియా స్టార్‌ని చేసేసింది. మహారాష్ట్రలోని అహల్యానగర్‌కు చెందిన 74 ఏళ్ల సుమన్ ధామనే తన మనవడి సాయంతో యూట్యూబ్ స్టార్‌గా మారిపోయారు. అక్కడి సంప్రదాయ వంటకాలు, పావ్ బాజీ వంటి రెసిపీలు కుకింగ్ చేసిన వీడియోలను YTలో అప్లోడ్ చేయడంతో ఆమె లక్షల మంది ప్రేమను పొందారు. ప్రస్తుతం ‘Aapli Aaji’ ఛానల్‌కు 17 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.
News February 15, 2025
రామ్ చరణ్‌తో మూవీ చేయట్లేదు: బాలీవుడ్ డైరెక్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీయబోతున్నారనే ప్రచారాన్ని బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’ డైరెక్టర్ నిఖిల్ నగేశ్ ఖండించారు. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను కొత్త స్టోరీతో త్వరలోనే సినిమా చేస్తానని తెలిపారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఇందులో కథ చెప్పే విధానంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తానని పేర్కొన్నారు.