News April 2, 2024

ఇద్దరూ సేమ్ రన్స్.. కానీ పరాగ్‌కే ఆరెంజ్ క్యాప్ ఎందుకంటే?

image

IPL-2024: ఇప్పటివరకు జరిగిన ప్రస్తుత సీజన్‌లో విరాట్ కోహ్లీ, రియాన్ పరాగ్ అత్యధిక రన్స్ చేశారు. కానీ RR ప్లేయర్ పరాగ్ క్యాప్ ధరించారు. రూల్స్ ప్రకారం.. ఇద్దరు క్రికెటర్లు సేమ్ రన్స్ చేస్తే.. అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్‌కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. పరాగ్ 160.17 స్టైక్ రేట్‌తో 181 రన్స్ చేయగా, విరాట్ 141.40 స్టైక్ రేట్‌తో 181 పరుగులు చేశారు.

Similar News

News November 8, 2024

తన స్నేహితుడిలా మరెవరికీ జరగొద్దని..!

image

దేశంలో ఏటా 1.50లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతోనే చాలామంది మరణిస్తున్నారు. అలా చనిపోయిన వారిలో దినేశ్ ఒకరు. తన మిత్రుడిలా ఎవరూ చనిపోవద్దని వివేక్ అనే వ్యక్తి ఓ పరికరం కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటో మెటిక్‌గా ట్రిగ్గర్ అయ్యే రక్షణ వ్యవస్థను తయారు చేశారు. ఇది ప్రమాద లోకేషన్‌ ఆధారంగా ఎమర్జెన్సీ సేవలకు సమాచారం ఇస్తుంది. ఇదంతా 3ని.లలోపే జరుగుతుంది.

News November 8, 2024

ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

image

AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2024

నోట్ల రద్దుకు 8 ఏళ్లు

image

కేంద్రం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి 8 ఏళ్లు పూర్తవుతోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ‘ATMల వద్ద రూ.2వేల కోసం క్యూ కట్టేవాళ్లం. మా వరకు వచ్చేసరికి ATM ఖాళీ అయ్యేది. స్కూల్ ఫీజుల కోసం రెండు మూడు సార్లు లైన్‌లో నిల్చునేవాళ్లం’ అని ట్వీట్స్ చేస్తున్నారు.