News April 24, 2024
ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేవెళ్లలోని రాజేంద్రనగర్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు బుద్ధి చెప్పాలని పార్టీ నేతలను కోరారు. BRSకు 8-10 సీట్లు ఇస్తే కేంద్రంలోని ప్రభుత్వం తాము చెప్పినట్లే వింటుందన్నారు.
Similar News
News July 8, 2025
భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.
News July 8, 2025
ఆ రికార్డు ఇప్పటికీ గంగూలీ పేరు మీదే..

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలు మార్చారు. టీమ్ ఇండియాకు తన ‘దాదా’గిరితో దూకుడు నేర్పించారు. సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి ప్లేయర్లు గంగూలీ హయాంలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచులు ఆడిన దాదా 18,575 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు ఉన్నాయి. 1997లో వన్డేల్లో వరుసగా నాలుగు POTM అవార్డులు అందుకోగా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇవాళ గంగూలీ పుట్టినరోజు.
News July 8, 2025
ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.