News March 18, 2024

ఆ ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: జగిత్యాలలో మోదీ

image

కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాస్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించిబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Similar News

News August 15, 2025

తిమ్మాపూర్: కానిస్టేబుల్ నరేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం

image

తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా KNR పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న నరేష్‌ను కలెక్టర్ ప్రమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.

News August 15, 2025

కరీంనగర్: ‘ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది’

image

కరీంనగర్‌లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల కృషి దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News August 15, 2025

కరీంనగర్ అర్బన్ బ్యాంకులో స్వాతంత్ర్య వేడుకలు

image

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాంక్ అధ్యక్షుడు గడ్డం విలాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులను స్మరించుకున్నారు. ప్రజల్లో దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి పట్ల నిబద్ధత పెరగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్య నిర్వహణ అధికారి శ్రీనివాస్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.