News May 24, 2024

బౌల్ట్.. తగ్గేదేలే

image

RR బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ సీజన్‌లో అతడు ఇన్నింగ్స్ తొలి ఓవర్లలో 7 వికెట్లు పడగొట్టడం విశేషం. పవర్‌ప్లేలో 12 వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టారు. 2020 సీజన్‌లోనూ అతడు ఇన్నింగ్స్ తొలి ఓవర్లలో 8 వికెట్లతో సత్తా చాటారు. ఇక ప్రస్తుతం SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో ముగ్గురు కీలక ఆటగాళ్లను బౌల్ట్ పెవిలియన్ పంపారు.

Similar News

News April 18, 2026

అప్పుడు మహిళలే బిల్లును వ్యతిరేకించారు.. ఎందుకంటే?

image

మహిళా రిజర్వేషన్లు బిల్లును ఒకప్పుడు మహిళలే వ్యతిరేకించారని తెలుసా? రాజ్యాంగ సభలో భాగమైన రేణుకా రే సహా పలువురు మహిళలు రిజర్వేషన్ వద్దనే వాదనను బలంగా వినిపించారు. అలా చేస్తే మహిళా ప్రాతినిధ్యం కొన్ని సీట్లకే పరిమితం అవుతుందని, జనరల్ సీట్లలో ప్రాధాన్యం తగ్గుతుందని 1947 జులై 18న జరిగిన సభలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో నెలకొన్న పరిస్థితులు వారి అంచనాలకు భిన్నంగా మారాయి.

News April 18, 2026

NEET అభ్యర్థులకు అలర్ట్

image

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు మే 3న దేశవ్యాప్తంగా NEET UG-2026 జరగనుంది. 2PM నుంచి 5PM వరకు పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తెచ్చుకోవాలని, లేదంటే అనుమతించబోమని NTA తెలిపింది. ఫుల్ స్లీవ్స్ ధరించవద్దని, లైట్, సింపుల్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోవాలని సూచించింది. వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పేర్కొంది.

News April 18, 2026

త్వరలోనే భూముల ధరల పెంపు: పొంగులేటి

image

TG: రాష్ట్రంలో త్వరలోనే భూముల ధరలను పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. ధరణితో ఏర్పడిన సమస్యలు భూభారతితో పరిష్కారమవుతాయన్నారు. అలాగే రెవెన్యూ శాఖలోనూ కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. భూముల మార్కెట్ విలువను 20 శాతం మేర పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇటీవల <<19616990>>ప్రభుత్వానికి<<>> సిఫారసు చేసింది.