News July 28, 2024
బౌలింగ్‌ను సూర్య, గంభీర్ కలిసి ప్లాన్ చేశారు: పరాగ్
శ్రీలంకతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ పరాగ్ బౌలింగ్‌లో చెలరేగారు. కేవలం 8 బాల్స్ వేసి 5 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు. తనతో బౌలింగ్ చేయించాలన్న ఆలోచన కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యదేనని పరాగ్ తెలిపారు. ‘బౌలింగ్ నాకు ఇష్టం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాను. పిచ్ స్పిన్‌కు బాగుంటే 16 ఓవర్ తర్వాత నేను బౌలింగ్ వేయాలనేది వారి ప్లాన్. పిచ్ బాగుండటంతో వికెట్లు తీయగలిగాను’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 21, 2024
ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే?
దేశంలోనే మోస్ట్ పాపులర్ నటుడి(నవంబర్)గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచినట్లు ORMAX మీడియా పేర్కొంది. గత నెలలోనూ ఆయనే ఈ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత దళపతి విజయ్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇక మోస్ట్ పాపులర్ నటిగా ఈ నెల కూడా సమంత నిలిచారు. ఆమె తర్వాత ఆలియా, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు.
News December 21, 2024
APPLY NOW: 723 ప్రభుత్వ ఉద్యోగాలు
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్-సికింద్రాబాద్ 723 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు రేపే(DEC-22) లాస్ట్ డేట్. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. మెటీరియల్ అసిస్టెంట్ & సివిల్ మోటార్ డ్రైవ్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య, ఇతర పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్: <
News December 21, 2024
లెజెండరీ క్రికెటర్లకు దక్కని ఫేర్వెల్
టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన లెజెండరీ క్రికెటర్లకు ఫేర్వెల్ లభించకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించిన యువరాజ్, ద్రవిడ్, సెహ్వాగ్, VVS లక్ష్మణ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ధోనీ, సురేశ్ రైనా, ధవన్, అశ్విన్‌లకు గుర్తుండిపోయే ఫేర్వెల్ ఇవ్వాల్సిందంటున్నారు.