News July 28, 2024

బౌలింగ్‌ను సూర్య, గంభీర్ కలిసి ప్లాన్ చేశారు: పరాగ్

image

శ్రీలంకతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ పరాగ్ బౌలింగ్‌లో చెలరేగారు. కేవలం 8 బాల్స్ వేసి 5 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీశారు. తనతో బౌలింగ్ చేయించాలన్న ఆలోచన కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యదేనని పరాగ్ తెలిపారు. ‘బౌలింగ్ నాకు ఇష్టం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాను. పిచ్ స్పిన్‌కు బాగుంటే 16 ఓవర్ తర్వాత నేను బౌలింగ్ వేయాలనేది వారి ప్లాన్. పిచ్ బాగుండటంతో వికెట్లు తీయగలిగాను’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 6, 2024

ఈ పండును తిన్నారా?

image

విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.

News October 6, 2024

ప్రకాశ్ రాజ్‌కు నిర్మాత కౌంటర్

image

TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కూర్చున్న ఫొటో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్‌కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే, మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీ మధ్య తేడా. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇంతవరకు చేయలేదు’ అని ట్వీట్ చేశారు. ఈయన ప్రకాశ్ రాజ్‌తో ‘ఎనిమీ’ మూవీ తీశారు.

News October 6, 2024

US నేషనల్ క్రికెట్ ఓనర్‌షిప్‌లోకి సచిన్

image

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్ (NCL) ఓనర్‌షిప్ గ్రూపులో చేరారు. 60 Strikes ఫార్మాట్లో జరిగే ఈ లీగులో విజేతకు ట్రోఫీ అందజేస్తారు. ‘నా లైఫ్‌లో అత్యుత్తమ జర్నీ క్రికెట్. US NCLలో చేరడం హ్యాపీగా ఉంది. కొత్త జనరేషన్లో ఈ టోర్నీ స్ఫూర్తి నింపుతుంది. అమెరికాలో క్రికెట్ వృద్ధిని గమనిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సన్నీ, వెంగీ, రైనా, డీకే, ఉతప్ప ఇందులో భాగమవుతున్నారు.