News October 30, 2024
ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ సాయిపల్లవి’
సాయి పల్లవి <<14456841>>గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో<<>> ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12వేలకు పైగా పోస్టులతో బాయ్‌కాట్ సాయిపల్లవి అన్న హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తన తాజా సినిమా అమరన్ తెరకెక్కిన నేపథ్యంలో ఆమె ఢిల్లీలోని అమరవీరుల స్మారక స్తూపాన్ని సందర్శించారు. సినిమా ప్రమోషన్స్ కోసం వార్ మెమోరియల్ వాడుకున్నారంటూ ఆ చర్య కూడా వివాదాస్పదమైంది.
Similar News
News November 7, 2024
ఏడాదిలో 4000 ATM మెషీన్‌లు క్లోజ్!
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర కూడా UPI పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. UPI, డిజిటల్ చెల్లింపుల కారణంగా భారతీయ బ్యాంకులు ATM మెషీన్‌లను మూసివేసే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాదిలోనే 4000 ATM మెషీన్‌లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ₹34.70 లక్షల కోట్ల నగదు చలామణి ఉంది. కాగా, దేశంలో లక్ష మందికి 15 ATMలు మాత్రమే ఉన్నాయి.
News November 7, 2024
ఏలూరు మెడికల్ కాలేజీకి డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు
AP: ఏలూరులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి డా.యల్లాప్రగడ సుబ్బారావు మెడికల్ కాలేజీగా నామకరణం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. వైద్య శాస్త్ర రంగానికి సుబ్బారావు అందించిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఆయన పేరును ప్రతిపాదించారని, దీనికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
News November 7, 2024
అమెరికా.. ఇదేం ప్రజాస్వామ్యం!
అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే USలో ఓటింగ్ నిబంధనల్లో యూనిఫామిటీ లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఓటేసే ముందు ఓటర్ ఫొటో ఐడీ ప్రూఫ్ చూపించడం ఏ దేశంలోనైనా కామన్. USలో మాత్రం అలాకాదు. 15 స్టేట్స్‌లో ప్రూఫ్ అవసరమే లేదు. మరికొన్ని రాష్ట్రాల్లో ఏదో ఓ ప్రూఫ్ చాలు ఫొటో లేకున్నా ఫర్లేదు. అలాంటప్పుడు ఓటర్ అమెరికనో, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంటో తెలిసేదెలా? అందుకే రిపబ్లికన్స్ దీనిని వ్యతిరేకించారు. మీరేమంటారు?