News May 19, 2024

ట్విటర్ ట్రెండింగ్‌లో BoycottNaturals.. ఎందుకంటే?

image

వీర్ సావర్కర్‌పై వ్యాఖ్యలతో ‘నేచురల్స్ సెలూన్’ CEO కుమారవేల్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. సావర్కర్ గొప్పతనం గురించి మాట్లాడాలని ఇటీవల మోదీ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. దీనిపై స్పందించిన కుమారవేల్ ‘సావర్కర్ పిరికి వ్యక్తి. గాంధీ హత్యలో సహ కుట్రదారు. క్షమాభిక్ష పిటిషన్లు వేయడంలో నిపుణుడు’ అని పోస్ట్ పెట్టారు. దీంతో సావర్కర్ అభిమానులు ట్విటర్‌లో #BoycottNaturals‌ను ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News December 8, 2024

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: KCR

image

TG: ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని KCR ధ్వజమెత్తారు. గురుకులాలు, విద్యారంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని చెప్పారు. మార్చిలో BRSలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు గులాబీ దళపతి.

News December 8, 2024

రెండో వారంలో వరుస IPOలు

image

స్టాక్ మార్కెట్ల‌లోకి Mon నుంచి IPOలు క్యూక‌ట్ట‌నున్నాయి. ముఖ్యంగా Dec 11న విశాల్ మార్ట్‌, మొబిక్విక్‌, సాయి లైఫ్ సైన్సెస్ రానున్నాయి. 12న ఇన్వెంచ‌ర‌స్ నాలెడ్జ్ సొల్యూష‌న్స్, 13న ఇంట‌ర్నేష‌న‌ల్ జెమోలాజిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ రానున్నాయి. అలాగే SMEలో Dhanlaxmi Crop Science, Jungle Camps India, Toss The Coin, Purple United Sales, Supreme Facility Management, Yash High voltage ఈ వారం IPOకు రానున్నాయి.

News December 8, 2024

IPOలో ఇన్వెస్ట్ చేస్తున్నారా?

image

IPOలో ఇన్వెస్ట్ చేసేముందు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాని ఆర్థిక స్థితి, బిజినెస్, Orders, profitability, Expansion Plans పరిశీలించాలి. SEBIకి ఆయా సంస్థ‌లు స‌మ‌ర్పించే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్(RHP) డాక్యుమెంట్‌లో వివరాలు ఉంటాయి. దీని ద్వారా రిస్క్ ఫ్యాక్ట‌ర్‌ని అంచ‌నా వేయాలి. గ్రే మార్కెట్ ప్రీమియం సూచ‌న‌లు ప‌రిశీలించాలి. Market Trends ఆధారంగా నిపుణుల సూచ‌న‌లు పాటించాలి. Share It.