News April 29, 2024

కుంచె పట్టిన బ్రహ్మ.. రాజా రవివర్మ!

image

భారత కళాచరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు రాజా రవివర్మ. స్వదేశీ, పాశ్చాత్య చిత్రకళల్ని కలగలిపి జీవం ఉట్టిపడే చిత్రాలను గీయడం ఆయన శైలి. 1873లో వియన్నాలో తన పెయింటింగ్స్‌కు మొదటి బహుమతి అందుకున్న అనంతరం ఆయన పేరు మారుమోగింది. నేటికీ ఎవరైనా అమ్మాయి చూడచక్కగా ఉంటే రవివర్మ బొమ్మతో పోల్చడం కనిపిస్తుంటుంది. 1848, ఏప్రిల్ 29న కేరళలో జన్మించిన ఆయన 1906, అక్టోబరు 2న కన్నుమూశారు. నేడు ఆయన జయంతి.

Similar News

News October 23, 2025

RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 880 టన్నుల రిజర్వులు ఉన్నట్లు RBI తాజా డేటా వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది $95 బిలియన్ (రూ.8.36 లక్షల కోట్లు)తో సమానం. 2025-26 FY తొలి 6 నెలల్లోనే 600 కేజీలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.

News October 23, 2025

రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలపై యూఎస్ ఆంక్షలు

image

రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలైన రాస్‌నెఫ్ట్, లూకోయల్‌పై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో ఆ సంస్థలతో యూఎస్ వ్యక్తులు, సంస్థలు ఎలాంటి వాణిజ్యం చేయకుండా నిషేధం అమలులో ఉండనుంది. ఈ చర్యలు రష్యా శక్తి వనరులపై ఒత్తిడిని పెంచి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేస్తాయని పేర్కొన్నారు. శాంతికి తామే మొగ్గుచూపుతామని, ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించాలని రష్యాను కోరారు.

News October 23, 2025

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

image

థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే జీవక్రియల పనితీరు బాగుంటుంది. లేదంటే పలు సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. దీనికోసం మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు. అయోడిన్ ఉన్న ఉప్పు, చిక్కుళ్లు, బటానీలు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే విటమిన్ C ఉండే ఫ్రూట్స్, ఫిష్, ఓట్స్, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ✍️ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.