News April 5, 2024
ఫ్యాన్స్ మధ్య బ్రహ్మి సందడి
హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సందడి చేశారు. హైదరాబాద్ – చెన్నై మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మానందంను చూసిన క్రికెట్ అభిమానులు బ్రహ్మి.. బ్రహ్మి అంటూ కేరింతలు కొడుతున్నారు. అలాగే, సీఎం రేవంత్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మ్యాచ్‌ను తిలకిస్తున్నారు.
Similar News
News January 20, 2025
ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
News January 20, 2025
కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే: భట్టి
TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12వేలు జమచేస్తామని పేర్కొన్నారు.
News January 20, 2025
ఈ నెల 28 నుంచి నాగోబా జాతర
TG: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఆదివాసుల పండగ నాగోబా జాతర ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే ఈ జాతరకు వేదపండితులు, దేవదాయశాఖ అధికారులు మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వానం పలికారు. ఈ జాతరకు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.