News October 5, 2024
బ్రహ్మోత్సవాలు: నేడు హంస వాహన సేవ

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ ఉదయం వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు హంస వాహన సేవ ఉంటుంది.
Similar News
News December 11, 2025
వేసవి కరెంటు కష్టాలు గట్టెక్కించేలా ‘యాదాద్రి’

TG: వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు తగ్గ ముందస్తు ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టింది. 2026 FEB నాటికి ఉత్పత్తి జరిగేలా 4000 MW ‘యాదాద్రి’ ప్లాంటును సిద్ధం చేస్తోంది. అప్పటికల్లా GENCO దీని సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఉత్పత్తి ప్రారంభమైతే బయటినుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం తప్పుతుంది. వేసవిలో గరిష్ఠ విద్యుత్ వినియోగం 17,500 MWగా ఉండగా ఈసారి 18000 MWకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News December 11, 2025
శ్రవణ్ సాయి హత్య.. సంచలన ఆరోపణలు

కృష్ణా(D)కు చెందిన శ్రవణ్ సాయి <<18525669>>హత్య కేసులో<<>> మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నా కూతురు గర్భవతి అని తెలిసింది. తప్పు చేసిందని ఆమెను కొట్టబోతుండగా అడ్డురావడంతో అతడికి దెబ్బలు తగిలాయి. ప్రెగ్నెన్సీ సంగతి అమ్మకు తెలిసిందని అతడికి నా కూతురు మెసేజ్ చేసిందట’ అని అమ్మాయి తల్లి తెలిపారు. శ్రవణ్‌ను టార్చర్ చేసి చంపారని, ఒంటిపై గాయాలున్నాయని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.
News December 11, 2025
కార్యకర్తలతో పనిచేయండి: BJP ఎంపీలతో మోదీ

BJP MPలు కార్యకర్తలతో కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై దక్షిణాది BJP MPలతో ప్రత్యేక భేటీలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నించాలన్నారు. వచ్చే ఏడాది కేరళ, తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కేంద్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.


