News December 3, 2024
ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ‘బ్రెయిన్ రాట్’

‘బ్రెయిన్ రాట్’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది. బ్రెయిన్ రాట్ అంటే మానసిక స్థితి క్షీణించడం, గతి తప్పడం. సోషల్ మీడియాలో అవసరం లేని కంటెంట్‌ను ఎక్కువ చూడటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఏ ప్రయోజనం లేకుండానే ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కాలం గడిపేసేవారికీ ఈ పదం వర్తిస్తుంది. ఈ ఏడాదిలో ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Similar News
News January 16, 2026
14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.
News January 16, 2026
242 బెట్టింగ్ సైట్లు బ్లాక్

ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. చట్టవిరుద్ధమైన 242 సైట్ల లింక్‌లను బ్లాక్ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం 7,800 ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను నిషేధించింది. వీటి వల్ల సమాజానికి నష్టం జరుగుతోందని, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.
News January 16, 2026
కుజ దోషం తగ్గు మొహం పట్టాలంటే…?

జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే వివాహ ఆలస్యం, రుణబాధలు, సంతాన సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆ గ్రహానికి అధి దేవుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. నిత్యం ‘రుణ విమోచక అంగారక స్తోత్రం’ పఠించడం, మంగళవారం ఎర్రని పుష్పాలతో అంగారకుడిని పూజించడం వల్ల దోషాలు తొలగుతాయి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయిస్తే వివాహ, ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల సంపదలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.


