News December 11, 2024
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలివే
మెదడులో కణితి పెరగడాన్ని బ్రెయిన్ ట్యూమర్‌గా వ్యవహరిస్తారు. ముందుగా గుర్తిస్తే దీని చికిత్స సాధ్యమే. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. తరచూ తలపోటు, ఫిట్స్, చూపు మందగించడం, వికారం, వాంతులు, శరీరంలో సమన్వయ లోపం, జ్ఞాపకశక్తి తగ్గుదల, తరచూ కోపం రావడం, తడబాటు, బలహీనత, వినికిడి మందగించడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే చెక్ చేయించుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.
Similar News
News December 26, 2024
ముఖ్యమంత్రి పదవినే వద్దనుకున్నా: సోనూ సూద్
తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.
News December 26, 2024
ఇండియన్స్‌కు తక్కువ జీతం ఇవ్వొచ్చు : అమెరికా కంపెనీ ఫౌండర్
భారత ఉద్యోగులపై నియర్ కో ఫౌండర్ ఫ్రాంకో పెరేరా చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని US వారికంటే భారతీయులకు తక్కువ వేతనం ఇవ్వడం తప్పుకాదని ఆయన linkedinలో పోస్ట్ చేశారు. ఇండియా, లాటిన్ అమెరికా, ఫిలిప్పీన్స్ గురించి ఇలా చెప్పారు. సమానమైన పని చేస్తున్నప్పటికీ ఇండియన్స్ ఇలా పనిదోపిడీకి గురవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News December 26, 2024
కాంగ్రెస్‌ను తొలగించాలని కోరుతాం: ఆప్
INDIA కూటమి నుంచి కాంగ్రెస్‌ని తొలగించాలని మిత్రపక్షాల్ని కోరుతామని ఆప్ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించడానికి BJPతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. BJP గెలుపు కోసం కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కేజ్రీవాల్‌ను యాంటీ నేషనల్ అని విమర్శించిన అజయ్ మాకన్‌పై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే కూటమి నుంచి ఆ పార్టీని తొలగించాలని కోరతామన్నారు.