News December 11, 2024

బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలివే

image

మెదడులో కణితి పెరగడాన్ని బ్రెయిన్ ట్యూమర్‌గా వ్యవహరిస్తారు. ముందుగా గుర్తిస్తే దీని చికిత్స సాధ్యమే. బ్రెయిన్ ట్యూమర్‌ లక్షణాల గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. తరచూ తలపోటు, ఫిట్స్, చూపు మందగించడం, వికారం, వాంతులు, శరీరంలో సమన్వయ లోపం, జ్ఞాపకశక్తి తగ్గుదల, తరచూ కోపం రావడం, తడబాటు, బలహీనత, వినికిడి మందగించడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే చెక్ చేయించుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.

Similar News

News January 18, 2025

మరోసారి జత కట్టనున్న ధనుష్‌-వెంకీ అట్లూరి!

image

‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్టును తమిళ నటుడు ధనుష్‌తో తీయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండోసారి ధనుష్‌తో జత కట్టనున్నారని, దీనికి ‘హానెస్ట్ రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘సార్’ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

News January 18, 2025

మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్

image

TG: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. కాగా మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్‌పల్లిలోని ఇంట్లో ఉంటున్నారు.

News January 18, 2025

సుచిర్ బాలాజీ మృతిపై స్పందించిన OpenAI

image

సుచిర్ బాలాజీ మృతిపై చాట్ జీపీటీ మాతృసంస్థ OpenAI స్పందించింది. ఇది తమను షాక్‌కు గురి చేసిందని, విలువైన సభ్యుడిని కోల్పోయామని కంపెనీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. OpenAI ఉద్యోగి అయిన బాలాజీ సంస్థ అనైతిక కార్యకలాపాలపై గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు. ఈక్రమంలోనే ఆయన నవంబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించారు. దీంతో తన కొడుకును మర్డర్ చేశారంటూ తాజాగా అతడి తల్లి ఆరోపించారు.