News July 12, 2024
చంద్రబాబే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్: భరత్

APకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ వెల్లడించారు. విశాఖలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, CII సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. ‘పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడంలో ముందుంటాం. వ్యాపారం సులభతరం చేయడంపై త్వరలో CMతో చర్చించి పాలసీని రూపొందిస్తాం. ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్’ అని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
ప్రతి ఏడాది ఫాలో అప్ సదస్సు పెట్టండి.. CM ప్రతిపాదన

TG: ప్రతి జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని CM రేవంత్ దావోస్లో ప్రతిపాదించారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని.. అందుకే ప్రతి ఏడాది జులై/AUGలో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని WEF ప్రతినిధులకు సూచించారు. ఇటీవల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం గుర్తు చేశారు.
News January 21, 2026
సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్, సబ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM),టెన్త్, 7వ తరగతి అర్హత కలిగినవారు అర్హులు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://centralbank.bank.in/
News January 21, 2026
శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

శబరిమలలో 2నెలలు కొనసాగిన మండల-మకరవిలక్కు ముగియడంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. మళ్లీ ఫిబ్రవరిలో జరగబోయే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని FEB 12 సా.5 గంటలకు తెరుస్తారు. పూజలు 17వ తేదీ రా.10గం.కు వరకు కొనసాగుతాయి. అప్పుడూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో మాదిరే ఆన్లైన్ బుకింగ్, దర్శన టోకెన్లు కొనసాగుతాయి.


