News August 14, 2025
ట్రంప్ టారిఫ్స్‌కు బ్రెజిల్ కౌంటర్ ప్లాన్స్

బ్రెజిల్‌పై US అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్స్‌కు ఆ దేశ అధ్యక్షుడు లూలా కౌంటరిచ్చేందుకు పావులు కదుపుతున్నారు. టారిఫ్స్‌తో ఎఫెక్ట్ అయిన దేశాధినేతలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జిన్‌పింగ్, మోదీలాంటి నేతల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. టారిఫ్స్‌తో నష్టపోతున్న వారి ఎగుమతిదారులకు 5.5 బి. డాలర్ల క్రెడిట్ లైఫ్‌లైన్, చిన్న పరిశ్రమలకు ట్యాక్స్ క్రెడిట్స్ ప్రకటించారు.
Similar News
News August 14, 2025
రేపు పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు

AP: కేంద్రం ఆదేశాల మేరకు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పథకాలపై అవగాహన, పశుసంవర్ధక శాఖ తోడ్పాటుతో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడంపై తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది.
News August 14, 2025
NTR, హృతిక్ ‘వార్-2’ పబ్లిక్ టాక్

NTR, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ప్రీమియర్ షోలు USలో నడుస్తున్నాయి. ఫస్టాఫ్‌లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్, NTR, హృతిక్ డాన్స్ హైలైట్ అని ఫ్యాన్స్ SMలో పోస్టులు చేస్తున్నారు. యాక్షన్ సీన్స్, సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు, క్లైమాక్స్ అదిరిపోయాయంటున్నారు. అయితే BGM, VFX ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదంటున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.
News August 14, 2025
కొత్త బార్ పాలసీ.. అర్ధరాత్రి వరకు పర్మిషన్

AP: ఎక్సైజ్ శాఖ కొత్త<<17322257>> బార్ పాలసీ<<>>ని ప్రకటించింది. ఇది SEP1 నుంచి మూడేళ్లపాటు అమలవుతుంది. మొత్తం 840 బార్లను నోటిఫై చేసింది. లాటరీ విధానంలో ఎంపిక ఉంటుంది. ఒక్క బారుకు కనీసం 4 అప్లికేషన్స్ వస్తేనే లాటరీ తీస్తారు. అప్లికేషన్ ఫీజు రూ.5లక్షలు+ రూ.10వేలు చెల్లించాలి. నూతన విధానం ప్రకారం ఉ.10 గం. నుంచి అర్ధరాత్రి 12గం. వరకు బార్లకు అనుమతి ఉండనుంది. రూ.99 మద్యం మినహా అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.