News May 24, 2024
జూన్ 30 వరకు తిరుమలలో బ్రేక్ దర్శనం రద్దు

AP: తిరుమలలో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడం, ఎన్నికలు పూర్తి కావడం, విద్యార్థులకూ పరీక్షలు ముగియనుండటంతో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనం ఉండదని తెలిపింది. ఈ సమయంలో ఏ సిఫార్సు లేఖలను అంగీకరించబోమని పేర్కొంది. క్యూలో సామాన్యుల ఎదురుచూపులను తగ్గించనున్నట్లు తెలిపింది.
Similar News
News February 7, 2025
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. BJPకే జైకొట్టిన మరో 2 సంస్థలు

ఢిల్లీలో ఈసారి BJP తిరుగులేని విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. నిన్న రాత్రి సర్వే ఫలితాలు వెల్లడించిన టుడేస్ చాణక్య, CNX కూడా కమలం పార్టీకే జైకొట్టాయి. ఆ పార్టీ 51 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్ చాణక్య అంచనా వేయగా, 49-61 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని CNX పేర్కొంది. కాగా BJP 45-55 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని నిన్న సాయంత్రం మై యాక్సిస్ ఇండియా తెలిపింది.
News February 7, 2025
సీఎం రేవంత్‌పై WEF ప్రశంసల జల్లు

TG: CM రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. ‘రాష్ట్ర అభివృద్ధికోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్ సదస్సులో మీరు కీలక భాగస్వామిగా వ్యవహరించారు. రైజింగ్ తెలంగాణ 2050 నినాదం ప్రత్యేకంగా నిలిచింది. 2047 కల్లా హైదరాబాద్‌ను కాలుష్యంలో నెట్ జీరో చేయాలన్న మీ సంకల్పం ప్రశంసనీయం’ అని కొనియాడింది.
News February 7, 2025
మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ: శోభిత

‘తండేల్’ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభిత మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారని, చేస్తున్నన్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్‌లోనే ఉన్నారు. గత ఏడాది dec 4న వీరి వివాహమైన సంగతి తెలిసిందే.