News April 25, 2024
భారత్‌లో టెస్లా ఎంట్రీకి బ్రేక్?

భారత్‌లో పెట్టుబడికి ఎలాన్ మస్క్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే ఇక్కడ టెస్లా ప్లాంట్ వస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పట్లో భారత్‌లో టెస్లా ఎంట్రీకి ఛాన్స్ లేదట. బడ్జెట్ కార్లు తేవడంపై దృష్టిపెట్టిన టెస్లా, ఉన్న ఫ్యాక్టరీల్లోనే తయారీ కొనసాగించాలని నిర్ణయించిందట. అందుకే మెక్సికో, భారత్‌కు ప్లాంట్లు విస్తరించాలన్న ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News March 20, 2026
ఇంటర్ వాల్యుయేషన్ వాయిదా

AP: రంజాన్ పండుగ సందర్భంగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ వాయిదా పడింది. మార్చి 21కి బదులుగా 22నుంచి వాల్యుయేషన్ స్టార్ట్ కానుందని విజయనగరం RIO తవిటినాయుడు తెలిపారు. తొలిరోజు లాంగ్వేజెస్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, స్పెల్-1 ఒకేషనల్ పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది. రెండో స్పెల్‌లో ఉండాల్సిన GFC పేపర్ల వాల్యుయేషన్‌ను కూడా 22 నుంచే నిర్వహించనున్నారు. ఈ వాయిదా ప్రభావం ఫలితాల వెల్లడిపై ఉండే అవకాశం ఉంది.
News March 20, 2026
సన్నబియ్యం పంపిణీకి రూ.7,366 కోట్లు: భట్టి

TG: రాష్ట్రంలో 3.38 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు బడ్జెట్లో ₹7,366CR కేటాయించినట్లు Dy CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనివల్ల 1.05 కోట్ల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే 4.50L ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ₹7,430CR ప్రతిపాదించామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
News March 20, 2026
ధాన్యం సేకరణ కోసం రూ.22,700 కోట్లు

TG: యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. దీని కోసం రూ.22,700 కోట్లను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.


