News June 28, 2024
జోరుకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు సెషన్ ఆరంభంలో ఉన్న జోరును దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి వరకు కొనసాగించలేకపోయాయి. సెన్సెక్స్ 79,032 (-210 పాయింట్లు), నిఫ్టీ 24,010 (-33) వద్ద ముగిశాయి. ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ICICI వంటి బడా షేర్ల నష్టాలు ప్రభావం చూపాయి. మార్కెట్లో స్టాక్స్ విలువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు. దీనిని దేశీయ ఇన్వెస్టర్లు క్యాష్ చేసుకుంటుండటంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడుతోందంటున్నారు.
Similar News
News December 10, 2024
శబరిమల వెళ్లే మహిళలకు గుడ్‌న్యూస్
శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.
News December 10, 2024
మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
News December 10, 2024
మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.