News March 26, 2025
BREAKING: సూర్యాపేట డీఎస్పీపై బదిలీ వేటు

సూర్యాపేట డీఎస్పీ రవి కుమార్‌పై బదిలీ వేటు పడింది. నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్ డీఎస్పీ రవికుమార్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
Similar News
News April 2, 2025
సిద్దిపేట: ‘జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి’

సిద్దిపేట జిల్లా నూతన మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) పి. వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో ఎక్కడా తాగు నీటి సమస్యలు తలెత్తకుండా పని చేయాలని కలెక్టర్ సూచించారు.
News April 2, 2025
సంగారెడ్డి: ‘పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు..’

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వల్లూరు క్రాంతి, నాయకులు పాల్గొన్నారు.
News April 2, 2025
2.O భిన్నంగా ఉంటుంది: జగన్

AP: వచ్చే ఎన్నికల్లో YCP భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. కరోనా వల్ల కార్యకర్తలకు నేను చేయాల్సినంత చేసుండకపోవచ్చు. ఈసారి జగన్ 2.O భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పులపై CBN అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.