News December 13, 2024

BREAKING: అల్లు అర్జున్ అరెస్ట్.. గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు

image

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఏ క్షణమైనా అల్లు అర్జున్‌ని వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

Similar News

News February 11, 2026

RR: 57.68%తో చేవెళ్ల టాప్.. మొత్తం ఎంతంటే!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాస్త ఊపందుకుంది. 12 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో 52.57% పోలింగ్ నమోదైంది. ఆమనగల్లు 54.4%, చేవెళ్ల 57.68,% ఇబ్రహీంపట్నం 52.73%, మొయినాబాద్ 49.67, శంకర్‌పల్లి 49.63, షాద్‌నగర్ 52.43% నమోదైంది.

News February 11, 2026

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల టాప్

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల వ్యాప్తంగా ఉ.11గం. వరకు మొత్తం 30.11% పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 31.06%, ఆమనగల్లులో 25.58, చేవెళ్లలో 34.02, మెయినాబాద్‌లో 26.97, శంకర్‌పల్లిలో 32.05, షాద్‌నగర్‌లో 32.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. యువత ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాసామ్య స్ఫూర్తిని చాటాలని సూచించారు. ఇప్పటివరకు చేవెళ్లలో ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది.

News February 11, 2026

రంగారెడ్డి 6 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఆమనగల్ మున్సిపాలిటీలో 11.44%, చేవెళ్లలో 11.54%, ఇబ్రహీంపట్నంలో 13.12%, మొయినాబాద్‌లో 12.41%, శంకర్‌పల్లిలో 9.26%, షాద్‌నగర్‌లో 11.84% నమోదయింది. ఈ లెక్కలను బట్టీ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటింగ్ సరళిని కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.