News November 27, 2024
BREAKING: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ఈగల్‌గా నామకరణం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు.
Similar News
News December 4, 2024
హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు
సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(GSEC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ ఆగస్టులో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. టోక్యో తర్వాత ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఏర్పాటు చేయనున్న తొలి సెంటర్ ఇదే. GSEC దేశంలో అధునాతన సెక్యూరిటీ, ఆన్లైన్ ఉత్పత్తుల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరించనుంది. సైబర్ సెక్యూరిటీలో పరిశోధనలకు వేదికగా నిలవనుంది.
News December 4, 2024
భూకంపం టెన్షన్.. అదే కారణమా?
ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుమారు 85వేల చెట్లు నేలకూలాయి. వీటిలో 50-100 ఏళ్ల మహావృక్షాలు కూడా ఉన్నాయి. ఇవాళ అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం రావడంతో చెట్లు కూలడమే ఇందుకు కారణమా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ అడవి సమీపంలో గోదావరి ప్రవహిస్తుండటం, బొగ్గు గనులు ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
News December 4, 2024
PSLV-C59 ప్రయోగం వాయిదా
శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన PSLV-C59 ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. రేపు సాయంత్రం 4.12 గంటలకు రాకెట్ ప్రయోగిస్తామని వెల్లడించింది. సూర్యుడి కరోనాను పరీక్షించేందుకు ఈ పరిశోధన చేపట్టారు.