News March 9, 2025
BREAKING: ఉత్కంఠ పోరు.. ఆర్సీబీ ఓటమి

WPL-2025: ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 226 పరుగులను ఆర్సీబీ ఛేదించలేకపోయింది. 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో 12 రన్స్ తేడాతో యూపీ గెలిచింది. ఆఖర్లో ఆర్సీబీ గెలుస్తుందనుకున్నా స్నేహ్ ఔట్ కావడంతో ఆ టీమ్ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ WPL నుంచి నిష్క్రమించింది.
Similar News
News March 15, 2025
మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.
News March 15, 2025
కోటరీ వల్ల రాజూ పోయేవాడు.. రాజ్యమూ పోయేది: VSR

AP: పూర్వం కోటల్లో రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని, రాజ్యం ఎలా ఉన్నా ఆహా రాజా! ఓహో రాజా అంటూ తమ ఆటలు సాగించుకునేవారని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని ట్వీట్ చేశారు. ‘కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోటా మిగలదు’ అని పేర్కొన్నారు. ఇటీవల జగన్ చుట్టూ కోటరీ ఉందని VSR ఆరోపించిన విషయం తెలిసిందే.
News March 15, 2025
గవర్నర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హత్య కేసులో కీలక పరిణామాలను ఆయనకు వివరించారు. వివేకా హత్య జరిగి 6 ఏళ్లు అయిందని, న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు.