News April 25, 2024
BREAKING: కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

TG: కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ బస్సు యాత్రకు వెళ్తున్న సమయంలో నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కాన్వాయ్‌లోని ఓ వాహనం బ్రేక్ వేయడంతో 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. వాహనాల్లోని BRS నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News January 13, 2026
IT కంపెనీల లాభాలకు గండి.. కారణమిదే

కొత్త లేబర్ కోడ్ల వల్ల IT కంపెనీల లాభాలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా వేతనంలో బేసిక్ పే 50% ఉండాలనే నిబంధన.. దీనివల్ల PF, గ్రాట్యుటీ ఖర్చులు పెరగడం సంస్థలకు భారంగా మారింది. అలాగే ఏడాదికే గ్రాట్యుటీ చెల్లింపు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం కంపెనీలు భారీగా నిధులను కేటాయించాల్సి వచ్చింది. ఈ అదనపు వ్యయాలే TCS, HCL వంటి కంపెనీల నికర లాభాలను తగ్గించాయి. అయితే ఇది ఈ క్వార్టర్‌కే పరిమితమని నిపుణులు తెలిపారు.
News January 13, 2026
ముంబై టార్గెట్ ఎంతంటే?

WPL-2026లో ముంబైతో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. ఓపెనర్ డివైన్(8) విఫలమవ్వగా మూనీ(33) ఫర్వాలేదనిపించారు. చివర్లో ఫుల్మాలి 15 బంతుల్లో 36 రన్స్ చేయగా, జార్జియా(43) తోడ్పాటునందించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, మాథ్యూస్, కేరీ, అమేలియా తలో వికెట్ తీశారు. MI టార్గెట్ 193.
News January 13, 2026
ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘ఇరాన్ దేశభక్తులారా.. ప్రభుత్వ సంస్థలను చేజిక్కించుకోండి. మిమ్మల్ని చంపే వారి, నిందించే వారి పేర్లను సేవ్ చేసుకోండి. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారులను చంపడం ఆపేంత వరకు ఇరాన్ ప్రతినిధులతో నా మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నా. మీకు అతిత్వరలో సాయం అందబోతోంది. Make Iran Great Again (MIGA)!’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.


