News April 25, 2024
BREAKING: కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం

TG: కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ బస్సు యాత్రకు వెళ్తున్న సమయంలో నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కాన్వాయ్‌లోని ఓ వాహనం బ్రేక్ వేయడంతో 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. వాహనాల్లోని BRS నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News January 16, 2026
భూమికి జనుము, అలసంద చేసే మేలు

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.
News January 16, 2026
మొన్న SETBACK.. నిన్న COMEBACK

WPLలో UPW క్రికెటర్ హర్లీన్ డియోల్ బ్యాటుతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. మొన్న DCతో మ్యాచ్‌లో హర్లీన్(36 బంతుల్లో 47రన్స్) స్లోగా ఆడుతున్నారనే కారణంతో కోచ్ అభిషేక్ నాయర్ ఆమెను రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించి మైదానం నుంచి బయటికి పిలిచారు. ఆ చర్యతో క్రికెట్ అనలిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. కాగా తన ఈగో హర్ట్ అయ్యిందేమో అన్నట్లుగా నిన్న MIపై 64(39 బాల్స్) స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
News January 16, 2026
173 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

NCERTలో 173 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పెంచారు. అర్హతగల వారు జనవరి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in


