News March 26, 2025
BREAKING: నటి ఐశ్వర్యారాయ్ కారుకు ప్రమాదం

అందాల తార ఐశ్వర్యారాయ్ కారుకు ప్రమాదం జరిగింది. ముంబైలో లోకల్ బస్సు ఆమె వాహనాన్ని వెనకనుంచి ఢీకొన్నట్టు బాలీవుడ్ షాదీస్ పేర్కొంది. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయినట్టు వెల్లడించింది. ఆ కారులో ఐష్ ప్రయాణించడం లేదని తెలిసింది. ఆమె బాడీగార్డ్స్ కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారని సమాచారం. ఏదేమైనా ఆమె క్షేమంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Similar News
News April 19, 2025
KKR అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్

భారత జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కేకేఆర్ జట్టుతో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘వెల్కమ్ బ్యాక్ హోమ్’ అంటూ KKR ట్వీట్ చేసింది. గతంలో అభిషేక్ KKR కోచింగ్ సిబ్బందిలో పనిచేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో నాయర్‌పై BCCI వేటు వేసినట్లుగా తెలుస్తోంది.
News April 19, 2025
ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.
News April 19, 2025
IPL: ముగిసిన డీసీ ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే..

అహ్మదాబాద్‌లో జరుగుతున్న IPL మ్యాచ్‌లో డీసీ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ 203 పరుగులు చేసింది. అశుతోశ్ (19 బంతుల్లో 37), అక్షర్ (32 బంతుల్లో 39), నాయర్ (18 బంతుల్లో 31) రాణించారు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 4, సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ తీసుకున్నారు. GT విజయ లక్ష్యం 204 పరుగులు.