News March 28, 2024
BREAKING: ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటన
మార్చి 31 నుంచి ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. 2024 మార్చి 31 నుంచి 2024 మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. మళ్లీ బోర్డు నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలని ఇంటర్ కాలేజీలను ఆదేశించింది.
Similar News
News January 19, 2025
ఖోఖో.. మనోళ్లు కొట్టేశారంతే!!
ఖోఖో తొలి ప్రపంచకప్‌లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్‌లో నేపాల్‌పై 54-36 తేడాతో టీమిండియా గెలుపొంది తొలి కప్‌ను ముద్దాడింది. అంతకుముందు అమ్మాయిల జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీమ్‌ను 78-40 తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 23 దేశాలు పాల్గొన్నాయి.
News January 19, 2025
డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారుల బెదిరింపులు: ఈటల
TG: హైడ్రా పేరుతో 3 నెలలుగా INC ప్రభుత్వం హంగామా చేస్తోందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీ నగర్, జవహర్ నగర్‌లో పేదలు భూములు కొని 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. ప్రతి పనిలో 7-10 శాతం కమీషన్ ఇవ్వనిదే బిల్లులు సెటిల్ కావట్లేదన్నారు.
News January 19, 2025
ఢిల్లీకి బయల్దేరిన సీఎం.. అక్కడి నుంచి జ్యురిచ్‌కు..
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఆయన జ్యురిచ్‌కు వెళ్తారు. సీఎం వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్, ఇతర అధికారులు వెళ్లనున్నారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వీరు పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ‘బ్రాండ్ ఏపీ ప్రమోషన్’ పేరుతో సీఎం నేతృత్వంలోని బృందం 5 రోజులపాటు దావోస్‌లో పర్యటించనుంది.