News August 9, 2024
BREAKING: భారత్‌కు మరో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రెజ్లింగ్ పురుషుల 57కేజీల విభాగంలో ప్యూర్టో రికోకు చెందిన డేరియన్ క్రజ్‌తో జరిగిన మ్యాచులో 13-5 పాయింట్ల తేడాతో అమన్ గెలుపొందారు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. కాగా రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.
Similar News
News March 4, 2026
ఇరాన్ పోరాటం వెనుక చైనా బలం!

US-ఇజ్రాయెల్‌కు ఇరాన్ దీటుగా బదులిస్తోంది. వాటిని టార్గెట్ చేస్తూనే UAE, ఒమన్, సౌదీ సహా 11 దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ పోరాటానికి రహస్యంగా చైనా సాయపడిందని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణులు, ఇతర అత్యాధునిక వెపన్స్‌తోపాటు కీలక సాంకేతికతను సరఫరా చేసిందని చెబుతున్నాయి. చైనా అండ లేకపోతే ఇరాన్ నిలబడేది కాదంటున్నాయి. శత్రువులపై కచ్చితత్వంతో చేస్తున్న దాడులను ఉదహరిస్తున్నాయి.
News March 4, 2026
అల్లు ఫ్యామిలీని చూశారా?

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
News March 4, 2026
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులు!

ఇరాన్ తమ భూభాగంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లతో క్లస్టర్ బాంబులు వదులుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ సమీపంలో ఈ బాంబు వల్ల 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది గాల్లో ఉన్నప్పుడే 80 చిన్న బాంబులుగా విడిపోయి కొన్ని కి.మీ. మేర విధ్వంసం సృష్టిస్తాయి. కొన్నిసార్లు పేలకుండా దశాబ్దాల పాటు భూమిలో ఉండిపోతాయి. ఏదైనా తాకితే పేలిపోతాయి. ఈ యుద్ధంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి.


