News January 2, 2025

BREAKING: హిందూ సాధువుకు బెయిల్‌ నిరాకరించిన బంగ్లా హైకోర్టు

image

హిందువుల రక్షణ కోసం పోరాడుతున్న సాధువు చిన్మయ్ కృష్ణ‌దాస్‌కు బెయిల్ ఇవ్వడానికి చిట్టగాంగ్ హైకోర్టు నిరాకరించింది. దేశద్రోహ కేసులో కొన్ని నెలల కిందట ఆయన్ను అక్కడి పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఆయన తరఫున అపూర్బ కుమార్ భట్టాఛార్జీ నేతృత్వంలోని 11 మంది సుప్రీంకోర్టు లాయర్ల బృందం వాదనలు వినిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో హిందువులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News January 24, 2025

కత్తిపోట్ల వల్ల పట్టు తప్పాను: పోలీసులతో సైఫ్

image

తనపై కత్తిదాడి కేసులో యాక్టర్ సైఫ్ అలీఖాన్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘కరీనా, నేనూ 11వ ఫ్లోర్‌లో ఉన్నాం. సడన్‌గా అరుపులు వినిపించడంతో జే రూమ్‌కు వెళ్లాం. అతను ఏడుస్తున్నాడు. అక్కడెవరో ఉన్నట్టు గమనించి పట్టుకొనేందుకు ప్రయత్నించా. ఆగంతకుడి కత్తిపోట్ల వల్ల నా పట్టు తప్పింది. వెంటనే జేను వేరే గదిలోకి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు రూ.కోటి డిమాండ్ గురించి చెప్పారు’ అని ఆయన వివరించారు.

News January 24, 2025

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

image

TG: ప్రైవేటు ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ‘డీట్’ యాప్ తెచ్చింది. AIతో పనిచేసే దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్హత, స్కిల్స్ ఎంటర్ చేస్తే రెజ్యుమే తయారవుతుంది. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, వర్క్ ఫ్రం హోంతో పాటు ఇంటర్న్‌షిప్ ఆప్షన్స్ ఉంటాయి. ఐటీ, ఆటోమొబైల్స్, ఫార్మా, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ తదితర కంపెనీలు ఇందులో రిజిస్టరై ఉండగా వాటికి కావాల్సినవారి రెజ్యుమేలను యాప్ రిఫర్ చేస్తుంది.

News January 24, 2025

రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

image

APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.