News March 1, 2025
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
Similar News
News November 25, 2025
ఇల్లు లేదా.. GOOD NEWS తెలిపిన బాపట్ల కలెక్టర్

జిల్లాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు స్థల సేకరణలో తగు చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. బాపట్ల జిల్లాలోని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలోని బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాల్లో సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 25, 2025
బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు?: శివాజీ

సినిమా టికెట్ ధరల పెంపుపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇండస్ట్రీలో 95శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు. ఇక్కడ అందరికీ లగ్జరీ లైఫ్ అంటూ ఉండదు. మూవీ టికెట్ రేట్లు పెరిగాయి అంటున్నారు. సంక్రాంతి టైమ్లో బస్సు ఛార్జీలు 3 రెట్లు పెంచుతారు. అప్పుడు ఎందుకు ఎవరూ మాట్లాడరు? అదే మూవీ టికెట్ రేటు పెరగ్గానే విలన్లా చూస్తారు. ఇది కరెక్ట్ కాదు’ అని శివాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మీ కామెంట్?
News November 25, 2025
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.


