News January 4, 2025

BREAKING: ఢిల్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన BJP

image

ఢిల్లీ ఎన్నికలకు BJP సమర శంఖం పూరించింది. 29 మందితో MLA అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ పోటీపడనున్నారు. కాల్‌కాజీలో CM ఆతిశీని రమేశ్ బిధూరీ ఢీకొంటారు. కరోల్‌బాగ్ నుంచి దుష్యంత్ గౌతమ్, రాజౌరీ గార్డెన్ నుంచి మజిందర్ సింగ్, బిజ్వాసన్ నుంచి కైలాష్ గహ్లోత్, గాంధీ నగర్‌ నుంచి అర్విందర్ సింగ్‌ పోటీ చేస్తున్నారు.

Similar News

News January 22, 2025

టీమ్ఇండియా జెర్సీపై పాక్ పేరు.. ICC వార్నింగ్!

image

టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్‌నేమ్ పాకిస్థాన్‌ను ముద్రించకుండా ఉండేందుకు ICC అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. BCCI రిక్వెస్ట్‌ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్‌నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

News January 22, 2025

బిల్‌గేట్స్‌తో భేటీ కానున్న చంద్రబాబు

image

AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.

News January 22, 2025

BREAKING: సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్

image

హైదరాబాద్‌లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి.