News August 16, 2024

BREAKING: ఎమ్మెల్సీగా బొత్స

image

AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. మూడేళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

Similar News

News September 14, 2024

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్సే: మంత్రి పొన్నం

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ <<14099367>>వ్యాఖ్యల<<>>కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చిగొట్టింది బీఆర్ఎస్ సభ్యులేనని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉండే సెటిలర్లను విమర్శించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ప్రాంతీయతను రాజకీయాల కోసం వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌లా నియంతృత్వ పోకడలకు తాము పోవడం లేదన్నారు.

News September 14, 2024

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత జట్టు చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత్ నామమాత్రపు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌ చేయడంతో భారత్‌ 2-1 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

News September 14, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం: గంటా

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి సెంటిమెంట్ అని MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ఆత్మాభిమానాలతో ముడిపడి ఉంది. ప్రైవేటీకరణ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కచ్చితంగా కాపాడుకుంటాం. ప్రైవేటీకరణను అడ్డుకోవడం YCP వల్ల కాలేదు. పక్క రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల కోసం సీఎంలు స్వయంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ప్రైవేటీకరణ యోచనను కేంద్రం మానుకుంది’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.