News November 11, 2024

BREAKING: రాంగోపాల్ వర్మపై కేసు

image

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వ్యూహం’ సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ నేత M.రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGVపై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News November 11, 2025

తానికాయ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

image

త్రిఫలాలలో(ఉసిరి, తాని, క‌ర‌క్కాయ‌) ఒకటైన తానికాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తానికాయ పొడిలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, ఆస్తమా సమస్యలు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు. విరేచనాలు, చిన్న పేగుల వాపు తగ్గి.. జీర్ణ, శ్వాస, మూత్రాశయ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఈ పొడిలో చక్కెర కలిపి తింటే కంటిచూపు మెరుగవుతుందని చెబుతున్నారు.

News November 11, 2025

పాపం.. ప్రశాంత్ కిశోర్

image

దేశంలోని అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్‌ స్ట్రాటజీలు సొంత రాష్ట్రంలో తన పార్టీకి మాత్రం ఉపయోగపడలేదు. ‘జన్ సురాజ్’ ద్వారా బిహార్ గతిని మారుస్తానంటూ చేసిన ఆయన ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇవాళ వెలువడిన అనేక ఎగ్జిట్ పోల్స్‌.. PK పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని తేల్చాయి. అనేక పార్టీలకు అధికారం తెచ్చానన్న ఆయన మాత్రం గెలుపు దరిదాపుల్లోకీ రాలేకపోయారు.

News November 11, 2025

ONGC గ్యాస్‌ను రిలయన్స్ దొంగిలించిందా?

image

ముకేశ్ అంబానీపై కోర్టులో <<18259833>>పిటిషన్<<>> నేపథ్యంలో ONGC గ్యాస్‌ను RIL దొంగిలించిందా? అన్నది చర్చగా మారింది. APలోని KG బేసిన్లో 2004-14 మధ్య తన బావుల లోపల నుంచి RIL పక్కకు తవ్వి అదే బేసిన్లోని ONGC బావుల గ్యాస్‌($1.55B)ను తీసుకుందని అప్పట్లో అధికారులు కేంద్రానికి తెలిపారు. DM, AP షా కమిటీలూ దీన్ని నిర్ధారించాయి. ఆపై RIL తనకు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డు తెచ్చుకోగా ఢిల్లీ హైకోర్టు దాన్ని పక్కన పెట్టింది.