News May 11, 2024

BREAKING: అల్లు అర్జున్‌పై కేసు నమోదు

image

AP: హీరో అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని ఆర్వో ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదైంది. కాగా శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు బన్నీ ఇవాళ నంద్యాలలో పర్యటించగా.. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

Similar News

News February 8, 2025

కేజ్రీవాల్ వెనుకంజ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కాల్కాజీ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగ్‌పుర నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ట్రయలింగ్‌లో ఉన్నారు.

News February 8, 2025

యూరియా కొరత.. రైతన్న వెత

image

TG: ఓవైపు యాసంగి వరిసాగు కీలక దశకు చేరుకున్న సమయంలో రైతన్నల్ని యూరియా కొరత వేధిస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో ఈ సీజన్ వరి సాగవుతోంది. గత నెలలోనే 90శాతం వరినాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి దశలో కీలకమైన యూరియా దొరక్కపోవడం అన్నదాతల్లో ఆందోళన పెంచుతోంది. వచ్చిన స్టాకు వచ్చినట్లు అయిపోతోంది. దీంతో వ్యాపారులు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News February 8, 2025

ఢిల్లీ అసెంబ్లీ.. ఎప్పుడు ఏ పార్టీది అధికారం?

image

1952లో 48 స్థానాలకు ఎన్నికలు జరగగా INC 39 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1956-93 మధ్య ఎన్నికలు జరగలేదు. 1993లో 70 స్థానాలకు గాను BJP 49 చోట్ల గెలిచి సీఎం పదవి చేపట్టింది. 1998, 2003, 2008లో వరుసగా 52, 47, 43 స్థానాలతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. 2013లో ఆప్(28)+కాంగ్రెస్(8) ప్రభుత్వం, 2015, 20లో వరుసగా 67, 62 స్థానాల్లో ఆప్ బంపర్ విక్టరీ సాధించింది. 2025 ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

error: Content is protected !!