News March 26, 2025

BREAKING: మాజీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్స్

image

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని ఆయన ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈనెల 10న బఘేల్ ఇంటిపై ED రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు.

Similar News

News April 19, 2025

ఒకే రోజు ఓటీటీ, టీవీల్లోకి కొత్త సినిమా?

image

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ ZEE5లో మే 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అదే రోజున జీ తెలుగు ఛానల్లోనూ రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అంతకుముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఒకే రోజున OTT, టీవీల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

News April 19, 2025

ఔరంగజేబు క్రూరుడని నెహ్రూయే అన్నారు: రాజ్‌నాథ్ సింగ్

image

మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటివాళ్లు దేశానికి ఆదర్శం కానీ ఔరంగజేబులాంటివారు కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘శౌర్యానికి, దేశభక్తికి మహారాణా ప్రతాప్ ఓ ప్రతీక. ఆయన్నుంచి స్ఫూర్తి పొంది శివాజీ మొఘలులపై పోరాడారు. ఔరంగజేబు పరమ క్రూరుడని నెహ్రూయే స్వయంగా అన్నారన్న విషయం అందరూ తెలుసుకోవాలి. రాణా, శివాజీ ఇద్దరూ మొఘలులకు మాత్రమే వ్యతిరేకం. ముస్లింలకు కాదు’ అని పేర్కొన్నారు.

News April 19, 2025

ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్‌పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

image

ఇరాన్‌పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!