News June 11, 2024

BREAKING: చంద్రబాబు వార్నింగ్

image

AP: తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ‘తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి’ అని CBN స్పష్టం చేశారు.

Similar News

News March 24, 2025

విమానం లేటైనా, రద్దైనా టికెట్ డబ్బులు వాపస్..

image

విమాన ప్రయాణికుల ముఖ్యమైన <<15872009>>హక్కులు<<>> * షెడ్యూలుకు 2వారాల నుంచి 24hrs లోపు రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా డబ్బు పొందొచ్చు * అన్నీ సవ్యంగా ఉన్నా బోర్డింగ్‌ను నిరాకరిస్తే డబ్బు పొందొచ్చు * ఫ్లయిట్ 6hrs లేటైతే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా పరిహారం, భోజనం పొందొచ్చు. 24hrs అయితే వసతి పొందొచ్చు. * లగేజ్ పోతే KGకి ₹3K, డ్యామేజ్ అయితే ₹1K వరకు పొందొచ్చు * ప్రమాదంలో చనిపోతే/గాయపడితే ₹20L పరిహారం వస్తుంది.

News March 24, 2025

శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

image

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

News March 24, 2025

TTDలో హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: BR

image

AP: 2025-26కు గాను ₹5,258Crతో TTD వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. TTDలో పనిచేసే హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేసినట్లు తెలిపారు. జూపార్క్ నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేట్ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని, వృద్ధులు, వికలాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!