News March 22, 2024

BREAKING: పరీక్షల తేదీల మార్పు

image

TG: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పులు చేశారు. EAPCET (పాత ఎంసెట్) అగ్రి అండ్ ఫార్మా పరీక్షను మే 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. మే 9, 10, 11 తేదీల్లో ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపారు. ఐసెట్ పరీక్ష తేదీలను జూన్ 5, 6 తేదీలకు మార్చామన్నారు.

Similar News

News September 17, 2024

మయన్మార్‌లో ‘యాగీ’ బీభత్సం.. 236 మంది మృతి

image

మయన్మార్‌లో యాగీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో 236 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 77 మంది గల్లంతైనట్లు చెప్పారు. అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 6.31 లక్షల మంది వరదలకు ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతినడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది.

News September 17, 2024

ఉమెన్స్ టీమ్ ప్రైజ్‌మనీ.. ICC సంచలన నిర్ణయం

image

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. పురుషుల టీమ్‌తో సమానంగా T20 వరల్డ్ కప్ ఉమెన్స్ టీమ్‌కు ప్రైజ్ మనీ ఇవ్వనుంది. విజేత జట్టుకు 2.34 మిలియన్ డాలర్లు ప్రకటించింది. ఇది గతేడాది ప్రైజ్‌మనీ(1 మి.డాలర్లు) కంటే 134% ఎక్కువ. రన్నరప్ టీమ్‌కు 1.17 మి.డాలర్లు(గతంలో 5,00,000 డాలర్లు), సెమీ ఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు 6,75,000 డాలర్లు ఇవ్వనుంది. కాగా OCT 3 నుంచి UAEలో మహిళల T20 WC జరగనుంది.

News September 17, 2024

ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా

image

ఢిల్లీ సీఎం పదవికి అర‌వింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న రాజ్ భవన్‌లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌ల‌సి రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు. వారం రోజుల్లో ఆతిశీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అప్పటివరకు కేజ్రీవాల్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు.