News September 23, 2024
BREAKING: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

AP: న్యాయశాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలో మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అటు అమరావతిలో 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News January 25, 2026
‘మన్ కీ బాత్’లో అనంతపురం ప్రస్తావన

AP: ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.
News January 25, 2026
‘సభా సార్’తో గ్రామసభ రికార్డుల డిజిటలైజేషన్

TG: రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో ‘సభా సార్’ ప్లాట్ఫామ్ను ఉపయోగించాలని కేంద్రం కోరింది. దీంతో సమావేశాల్లో చర్చించిన అంశాల ఆడియో/వీడియో రికార్డింగ్స్తో ఆటోమేటిక్గా సమావేశ మినిట్స్ రూపొందించవచ్చని తెలిపింది. దీని వల్ల శ్రమ తగ్గి, పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
News January 25, 2026
పద్మ అవార్డుల ప్రకటన

వివిధ రంగాల్లో సేవలందించిన 45 మంది వ్యక్తులకు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డి(పాడి, పశుసంవర్ధక విభాగం), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్(జన్యు సంబంధ పరిశోధనలు), తమిళనాడుకు చెందిన నటేశన్ తదితరులు ఉన్నారు.


