News June 21, 2024

BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

image

TG: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్‌లోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు. సూసైడ్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

నిర్మల్: డిఎడ్ పరీక్షకు 9 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిర్మల్ కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న డిఎడ్ మొదటి సంవత్సరం పరీక్షల్లో బుధవారం మొత్తం 88 మందిలో 79 మంది హాజరయ్యారని, 9 మంది గైర్హాజరైనట్లు డీఈవో భోజన్న తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ పరిశీలించారు. కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, మెడికల్ సిబ్బంది తదితర ఏర్పాట్లు చేశారు.

News December 3, 2025

టాటా ట్రస్ట్ ఎలక్షన్ ఫండ్స్.. 83 శాతం బీజేపీకే

image

2024-25 లోక్‌సభ ఎలక్షన్ ఇయర్‌లో టాటా గ్రూప్‌ అనుబంధ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి BJPకి రూ.757 కోట్ల ఫండ్స్ అందాయి. ట్రస్ట్ అందించిన మొత్తం నిధుల్లో ఇది 83% కాగా 8.4% వాటాతో కాంగ్రెస్‌ రూ.77.3 కోట్లు అందుకుంది. ఈసీకి అందించిన వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల సమయంలో BJP, కాంగ్రెస్ సహా 10 రాజకీయ పార్టీలకు రూ.914 కోట్ల నిధులొచ్చాయి. YCP, BRS తదితర పార్టీలకు చెరో రూ.10 కోట్లు ఇచ్చింది.

News December 3, 2025

APPLY NOW: IIFTలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్‌ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కార్పొరేట్ రిలేషన్స్&కెరీర్ అడ్వాన్స్‌మెంట్ కోఆర్డినేటర్(3) పోస్టులకు ఈనెల 11వరకు, రీసెర్చ్ అసోసియేట్, కేస్ స్టడీ మేనేజర్ పోస్టులకు ఈనెల 13వరకు, గ్రాఫిక్ డిజైనర్ పోస్టుకు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/PGDBM/PG, PhD, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. వెబ్‌సైట్: www.iift.ac.in